కాంక్రీట్‌ పనులు ప్రారంభించిన ఎంఈఐఎల్‌

, పోలవరం : అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ నిర‍్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. చెప్పిన గడువుకంటే ముందుగానే పోలవరం పూర్తిచేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా స్పిల్ వే ప్రాంతంలో కాంక్రీట్ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ గురువారం శ్రీకారం  చుట్టారు. తొలిరోజు 100 క్కుబిక్కు మీటర్ల పనిని ఇవాళ పూర్తి చేసింది. ఈ పనుల శాతాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతూ లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నది.