పీకే బహిష్కరణ.. మీరు మళ్లీ సీఎం కావాలి!

పట్నా: నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పీకేతో పాటు మరో నాయకుడు పవన్‌ వర్మను కూడా పార్టీ నుంచి తొలగించింది. కాగా 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్‌ కిషోర్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అదే విధంగా బిహార్‌లో జేడీయూ అధికారం చేపట్టడం, నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కావడానికి ఆయన వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో పీకే.. పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.