ఆ జంట అధికారికంగా విడిపోయింది!

ముంబై : బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌, మాజీ సూపర్ మోడల్‌ మెహర్‌ జెసియా అధికారికంగా విడిపోయారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.  'రాక్‌ ఆన్‌' ఫేమ్‌ అర్జున్‌ రాంపాల్‌ 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి భార్య మెహర్‌ జెసియాను విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఇందుకు సమ్మతం తెలపడంతో... ' ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అందమైన ఙ్ఞాపకాలు ఉన్నాయి. ప్రస్తుతం మేం వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. కొత్త జీవితం ఆరంభించాలనుకుంటున్నాం అంటూ 2018లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో జడ్జి శైలజా సావంత్‌ ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ముంబై మిర్రర్‌ కథనం ప్రచురించింది.